Kalvakuntla Kavitha : కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-14 10:22:04.0  )
Kalvakuntla Kavitha  : కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసిన అంశంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద కుంభకోణమని, భారీ అవినీతి జరిగిందని, ఈ కేసులో ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా జైల్లోనే ఉన్నారని అన్నారు. కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదని, తనకు ఎలాంటి ఆసక్తీ లేదన్నారు. ఈడీ తన దర్యాప్తుల భాగంగా ఎవరికి నోటీసులు ఇస్తుందో తమకేం సంబంధమని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీకి సంబంధించిన ఆ వ్యవహారంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికిగానీ, తెలంగాణ లీడర్‌షిప్‌కుగానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

Advertisement

Next Story