మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు

by GSrikanth |   ( Updated:2023-09-05 05:24:00.0  )
మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబం శ్వేతా గ్రానైట్స్ పేర వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గ్రానైట్ ఎగుమతుల్లో రూ. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇక, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో కేవలం రూ.3 కోట్లు మాత్రమే కట్టారని, రూ.50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 2022, నవంబర్‌లో ఈడీ అధికారులు శ్వేతా ఏజెన్సీస్‌పై దాడులు చేసి సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అంతకు ముందు విజిలెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టులో 7.6లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్టు పేర్కొనటం గమనార్హం.

Advertisement

Next Story