నేడు ఈడీ విచారణకు అభిషేక్‌.. రోహిత్ రెడ్డి కేసులోనే విచారణకు పిలుపు!

by GSrikanth |
నేడు ఈడీ విచారణకు అభిషేక్‌.. రోహిత్ రెడ్డి కేసులోనే విచారణకు పిలుపు!
X

దిశ, వెబ్‌డెస్క్: గుట్కా వ్యాపారంపై దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ వ్యాపారంలో నందకుమార్ మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఇప్పటికే పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) విచారణకు హాజరుకావాలని ఈడీ గుట్కా సంస్థ డైరెక్టర్ అభిషేక్‌కు బుధవారం నోటీసుల్లో పేర్కొంది. బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టులతో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది.

అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. తమ సంస్థ 'మాణిక్‌చంద్ పాన్ మసాలా' పేరును రూ.40 కోట్లను కొంటానని ఒప్పందం చేసుకొని రూ.2 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి తర్వాత పట్టించుకోవడం మానేశాడని ఆరోపించారు. దీనివల్ల తాము తాము మోసపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, దీనిపై పోలీసులకు మాత్రం ఇంకా కేసు నమోదు చేయలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే రెండు సార్లు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఈనెల 27వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విచారణ కొనసాగుతుండగానే నందకుమార్‌పై మోసం కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన అభిషేక్‌ను కూడా విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story