- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ED: ఫార్ములా ఈ-రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల సంచలన లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formule E-Race Case)లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా, తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ (CB DG Vijay Kumar)కు, హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ (ED Joint Director Rohit Anand) లేఖ రాశారు. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై నమోదైన కేసు వివరాలను అందజేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు HMDA సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారో పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా ట్రాన్సాక్షన్లు ఏయే తేదీల్లో జరిగాయో వివరాలు పంపాలని లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని ఈడీ జాయింట్ డైరెక్టర్, ఏసీబీ డీజీకి రాసిన లేఖలో కోరారు.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car racing) వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఏసీబీ (ACB) అధికారులు గురువారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా కేటీఆర్ (KTR), ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ (IAS Aravind Kumar), ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఏసీబీ (ACB)కి లేఖ రాశారు.