- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి గ్రీన్ సిగ్నల్
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాములవారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వీళ్లేదని సూచించింది. దీంతో ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఈవోకు లేఖ రాసింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని.. ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కొండా సురేఖ కోరారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించకుండా జరుపుకోవాలని తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story