తెలంగాణలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు

by Prasad Jukanti |   ( Updated:2024-01-27 13:32:50.0  )
తెలంగాణలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్వల్ప భూకంపం సంభవించింది. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రంతో పాటు ముంగి తదితర గ్రామాల్లో శనివారం భూప్రకంపనలు కలకలం రేపాయి. సాయంత్రం 4:30 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story