- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gattikal : ఊరు ఊరంతా రక్తదానం చేస్తోందా.. ఆశ్చర్యపోయిన డీఎస్పీ
దిశ, వెబ్‌డెస్క్: రక్తదానం అంటే ఎవరోకొందరు యువకులు ముందుకు రావడం చూశానని, కానీ గట్టికల్లు (Gattikal) గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో రక్తదానం చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సూర్యాపేట డీఎస్పీ రవి (Suryapet DSP Ravi) అన్నారు. సమస్యాత్మక గ్రామంగా ఉన్న గట్టికల్లు నేడు రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని, జిల్లా ప్రజలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. శనివారం ఆత్మకూర్ (ఎస్)(Athmakur (S)) మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో మద్యపాన నిషేధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ఇవ్వవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు. రక్తం అందక ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆదర్శనీయం గట్టికల్లు గ్రామం..
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గట్టిగల్లులో మద్యపానం నిషేధం ప్రారంభించి గ్రామస్తులంతా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని డీఎస్పీ రవి అభినందించారు. రాజకీయాలకతీతంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మద్యపాన నిషేధం బాటలో పరిసర గ్రామాలు నడుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం అంటేనే న్యాయ పోరాటంలో చైతన్యవంతమైనదని, అన్యాయం ఎక్కడ జరిగిన పోరాటం చేయడంలో ఆత్మకూరు మండల ప్రజలు ముందుంటారని కితాబు ఇచ్చారు. మద్య నిషేధం కారణంగా గ్రామంలో ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కనిపిస్తున్నారని, వారి ఆనందాన్ని చూస్తే మద్య నిషేధం పక్కగా అమలవుతుందని తెలుస్తుందన్నారు. యువకులు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఐకమత్యాన్ని చాటాలన్నారు.
గట్టికల్లును శాంతియుత గ్రామంగా చేస్తాం..
సంస్థాపక గ్రామంగా ఉన్న గట్టికల్‌ను రాబోయే ఎన్నికలలో శాంతియుత గ్రామంగా చేస్తామని డీఎస్పీ రవి ప్రకటించారు. మండంలో మద్యపాన నిషేధం దిశగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న గట్టికల్లు యువకులను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. అనంతరం గ్రామ యువజన సంఘాలకు చెందిన యువకులు, గ్రామస్తులు రక్తదానం చేశారు. అనంతరం గ్రామ మద్యపాన శాఖ కమిటీ, యువజన సంఘాలు డీఎస్పీ రవి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)నాయకులు బైరు వెంకన్నగౌడ్, ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును, సొంత ఖర్చులతోగ్రామంలోని రోడ్లను మరమ్మతులు చేసిన సంద్యాల నాగార్జునను డీఎస్పీ రవి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల బాధ్యులు దండా వెంకటరెడ్డి, దొంతగాని కరుణాకర్ గౌడ్, గంపల కృపాకర్, గూగుల్ గణేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.