DSC: నవంబర్ 3న ఛలో ఇందిరా పార్క్.. తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం పిలుపు

by Ramesh Goud |
DSC: నవంబర్ 3న ఛలో ఇందిరా పార్క్.. తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ కోటా రద్దు చేయాలని బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. దీని కోసం నవంబర్ 3న బీఎడ్ అభ్యర్థుల ఛలో ఇందిరా పార్క్ పేరుతో ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రకటన విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకటనలోని డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ విధంగానైతే డీ.ఎడ్ చేసిన వారికే 100 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్‌జీటీ రాసుకునే అవకాశం ఇస్తున్నారో.. అదే విధంగా బీ.ఎడ్ చేసిన వారిచే డీఎస్సీలో 100 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చెయ్యాలని కోరుతున్నారు.

అలాగే గవర్నమెంట్ ఎస్‌జీటీ టీచర్లకు 70 శాతం ప్రమోషన్స్ ఇస్తూ.. 30 శాతం మాత్రమే బీ.ఎడ్ వారిచే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే విధంగా ఉన్న 108 జీవోను రద్దు చేయాలని అంటున్నారు. అంతేగాక 505 జీవోను పునరుద్దరించి.. ఎస్‌జీటీ పోస్టులను 100 శాతం బీ.ఎడ్ వారిచే మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే విధంగా దానిని సవరించాలని కోరుతున్నారు. ఇక డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ను.. డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గా విభజించాలని, ప్రైమరీ టీచర్లకు బోర్డ్ ఆప్ ప్రైమరీ ఎడ్యకేషన్ లోనే ప్రమోషన్స్ ఇవ్వాలని, అదే విధంగా సెంకడరీ టీచర్లకు బోర్డ్ ఆప్ సెంకడరీ ఎడ్యుకేషన్ లోనే ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ బీ.ఎడ్ అభ్యర్థుల సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed