- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి
దిశ ,సూర్యాపేట కలెక్టరేట్ :- రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు .బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అధికారులతో రాష్ట్ర గవర్నర్ పర్యటన గురించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10:00 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు దేవ్ వర్మ కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా అధికారులతో, జిల్లాలోని కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో,ప్రముఖులతో ముఖాముఖీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గవర్నర్ పర్యటనకి సంబంధించి వివిధ శాఖలచే అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పి పి టి ద్వారా సంబందిత అధికారులు కలెక్టర్ కి వివరించారు. గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. తదుపరి ఏర్పాట్లను పరిశీలించి కలెక్టరేట్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని, జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఛాయా చిత్ర ప్రదర్శన, డి ఆర్ డి ఎ, డి డబ్ల్యూ ఓ, డి యం హెచ్ ఓ, అగ్రికల్చర్, హార్థి కల్చర్, పశు సంవర్ధన శాఖ లచే స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్ డిఓలు వేణు మాధవ్, సూర్య నారాయణ, శ్రీనివాస్ లు,డి ఆర్ డిఎపిడివివి అప్పారావు,డిఈఓ ఆశోక్, డి పి ఓ నారాయణ రెడ్డి, డి యం హెచ్ ఓ కోటాచలం, అగ్రికల్చర్ శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, పశు సంవర్ధన అధికారి శ్రీనివాస్,డి టి డి ఓ శంకర్,బి సి వెల్పేర్ అధికారి అనసూయ, ఎస్ సి వెల్పేర్ అధికారి లత,పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.