NMDC Jobs: ఎన్ఎండీసీలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు, విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-23 15:08:16.0  )
NMDC Jobs: ఎన్ఎండీసీలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు, విభాగాల వారీగా ఖాళీల వివరాలివే
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD)లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కొర్పొరేషన్(NMDC) పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 153 జూనియర్ ఆఫీసర్(Trainee) పోస్టులను భర్తీ చేయనున్నారు. కమర్షియల్, ఎన్విరాన్ మెంటల్, జియో అండ్ క్వాలిటీ కంట్రోల్, మైనింగ్, సర్వే తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nmdc.co.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 10 నవంబర్ 2024.

ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న పోస్టుల వివరాలు:

  • మైనింగ్ - 56 పోస్టులు
  • ఎలక్ట్రికల్ - 44 పోస్టులు
  • మెకానికల్ - 20 పోస్టులు
  • సివిల్ - 9 పోస్టులు
  • కమర్షియల్ - 4 పోస్టులు

విద్యార్హత:

పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ, డిప్లొమా ఉతీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్ టెస్ట్, సూపర్ వైజారీ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 250, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 37,000 నుండి రూ.1,30,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story