పబ్బుల్లో డ్రగ్స్ దందా! మరో ముఠా అరెస్ట్..

by Ramesh N |
పబ్బుల్లో డ్రగ్స్ దందా! మరో ముఠా అరెస్ట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న మరో ముఠా పట్టుబడింది. ఇటీవల నార్సింగి డ్రగ్స్ కేసులో ఆర్టిస్ట్ లావణ్య, కోకాపేట్ ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్టయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ పబ్బుల్లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు క్రమంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.

బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి.. మదాపూర్ నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్ క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ తో పాటు కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story