HYD Metro : ఎల్బీనగర్ - హయత్‎నగర్ మెట్రో రైలు డీపీఆర్ సిద్ధం..

by Bhoopathi Nagaiah |
HYD Metro : ఎల్బీనగర్ - హయత్‎నగర్ మెట్రో రైలు డీపీఆర్ సిద్ధం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఫేజ్-2 మెట్రో రైలు విస్తరణ పనులకు అధికారులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన ఎల్బీ నగర్ టు హయత్ నగర్ రూట్‌లో పనులు ప్రారంభించేందుకు డీపీఆర్ రెడీ చేశారు. మొత్తం 7 కిలోమీటర్ల దూరం మెట్రోను విస్తరించనున్నారు. ఈ రూట్‌లో మొత్తం ఆరు మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. అంటే అటుఇటుగా కిలోమీటరుకు ఓ మెట్రో స్టేషన్‌ను ప్రదిపాదించారు. నేషనల్ హైవే 65 అయిన ఈ రహదారిలో ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అలాగే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు హైవే అథారిటీ అధికారులతో కలిసి మెట్రో రైలు ఫేజ్-2 పనులు చేసేందుకు సుముఖం తెలిపారు. ఆయా విభాగాల అధికారులు చర్చలు జరిగిపి.. తాజాగా మెట్రో అధికారులు ఎల్బీ నగర్ టు హయత్ నగర్ రూట్‌‌ మ్యాప్‌కు సంబంధించిన డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందజేశారు.

చింతల్ కుంటలో మొదటి మెట్రో స్టేషన్

కాగా, మెట్రో రైలు ఫేజ్-2లో మొత్తం 70 కిలో మీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగానే ఎల్బీ నగర్ - హయత్ నగర్ మధ్య ఏడు కిలోమీటర్ల విస్తరణకు నడుం బిగించారు. ఈ మార్గంలో చింతల్ కుంటలో ఓ మెట్రో స్టేషన్ నిర్మించనున్నారు. మిగతా ఆరుస్టేషన్లు ఎక్కడెక్కడ అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చింతల్ కుంట, హయత్ నగర్ మధ్యలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు భారీ ఫ్లై ఓవర్ నిర్మించడానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రో రైలును ఎల్బీ నగర్ టు హయత్ నగర్ రూట్‌‌లో ఎడమవైపు నిర్మిస్తామని అధికారులు వెల్లడించారు.

తీరనున్న ట్రాపిక్ కష్టాలు

ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఏపీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ కలగనుంది. ముఖ్యంగా కోటి నుంచి హయత్ నగర్ వరకు తీవ్రమైన ట్రాపిక్ ఉంటుంది. సిటి దాటడానికే సుమారు గంటరన్న నుంచి రెండు గంటల సమయం పడుతుంది. మెట్రో నిర్మిస్తే కేవలం అరగంటలో సిటిని క్రాస్ చేయవచ్చు. అలాగే హయాత్ నగర్, వనస్థలిపురం నుంచి ఐటీ కారిడర్‌లో ఉద్యోగం చేసే వారికి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో బస్సుల్లో వెళ్తే 2 నుంచి 3 గంటల వరకు సమయం వృథా అవుతుంది. ఇక వర్షాలు పడితే అంతేసంగతులు. ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్- దుర్గం చెరువు వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండటం వల్ల గంట, గంటన్నరలో ప్రయాణం చేయవచ్చు.

Advertisement

Next Story