DOST Web Options: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ వెబ్ అప్షన్ల తేదీలు ఖరారు

by Shiva |
DOST Web Options: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ వెబ్ అప్షన్ల తేదీలు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదలైంది. మే 6 నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ.200 రుసుముతో, రెండో ఫేజ్‌లో రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. తాజాగా, ఈ నెల 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. అందుకు ఈ నెల మే30 వరకు గడువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు మరోసారి తేదీలను సవరించామని వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో ఉన్నత విద్యా మండలి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనుందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story