వాటిని ప్రమోట్ చేయవద్దంటూ.. సానియాకు ట్వీట్ ట్యాగ్ చేసిన సజ్జనార్

by Sathputhe Rajesh |
వాటిని ప్రమోట్ చేయవద్దంటూ.. సానియాకు ట్వీట్ ట్యాగ్ చేసిన సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక మోసాలకు పాల్పడే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలను ప్రమోట్ చేయవద్దని ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ వీ.సీ. సజ్జనార్ సెలబ్రిటిలను సూచించారు. క్యూనెట్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయవద్దని అలాంటి కంపెనీల యాడ్‌లలో నటించవద్దని కోరారు. తాజాగా భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జాపై వచ్చిన ఓ వార్తా కథనాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. క్యూనెట్ వంటి మల్టీలెవల్ సంస్థలను ప్రమోట్ చేయవద్దని వీటి వల్ల సామాన్య ప్రజలు భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, సానియా మిర్జాలపై యాష్ ట్యాగ్ ఇస్తూ శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. కాగా దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలో సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అమితాబచ్చన్‌కు సజ్జనార్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో తాజా మరోసారి ఆయన ట్విట్టర్ వేదికాగా సెలబ్రెటీలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. అయితే సజ్జనార్ వంటి వారు ఎంత అలర్ట్ చేసినా కొంత మంతి సెలబ్రిటీలు తమ తీరు మార్చుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. తమ వల్ల సమాజం ప్రభావితం అవుతుందని తెలిసినా కొంత మంది సెలబ్రిటీలు మాత్రం తప్పుడు ప్రొడక్ట్‌లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story