మమ్ములను బాధ్యులను చేయకండి : తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ వినతి

by M.Rajitha |
మమ్ములను బాధ్యులను చేయకండి : తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో మున్సిపల్ కమిషనర్లను బాధ్యులను చేయరాదని, ఏలాంటి శాఖపరమైన విచారణలేకుండానే హైడ్రా సిపార్సు మేరకు క్రిమినల్ కేసులు పెట్టొద్దని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ను తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్(టీఎంసీఏ) కోరింది. ఈ మేరకు బుధవారం దానకిషోర్ కు టీఎంసీఏ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్ భాగస్వామ్యం లేకుండా బిల్డింగ్స్ పర్మిషన్లు ఇవ్వకూడదని టీఎంసీఏ తెలిపింది. మున్సిపాలిటీల్లో కమిషనర్ కు అనేక బాధ్యతలు ఉంటాయని, అన్ని పనులు చూసుకోవడం కష్టంగా ఉందని వివరించింది. సాంకేతిక పరమైన అంశాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజినీర్ లకు బాధ్యతలు ఇవ్వాలని కోరింది. చందానగర్ డిప్యూటీకమిషనర్ గా పనిచేసిన సుదాంష్ బిల్డింగ్ పర్మిషన్ విషయంలో రీమార్క్ రాశారని, కానీ బిల్డింగ్ పర్మిషన్ జారీచేసింది మాత్రం అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) అని గుర్తు చేసింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో సంబంధిత కమిషనర్ కు తెలియకుండా కమిషనర్ పేరుతో హెచ్ఎండీఏ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లిలో సర్వేనెం.48,49లో మ్యాప్స్ ఇన్ఫ్రాకు 13సెప్టెంబర్2023లో 1.హెచ్ఎండీఏ ప్రొసిడింగ్స్ లెటర్ నెం.008369/బీపీ/హెచ్ఎండీఏ/1830/ఎంఇడ్/2023, 2.హెచ్ఎండీఏ ప్రొసిడింగ్స్ లెటర్ నెం.008370/బీపీ/హెచ్ఎండీఏ/1831/ఎంఇడ్/2023, 3.హెచ్ఎండీఏ ప్రొసిడింగ్స్ లెటర్ నెం.008371/బీపీ/హెచ్ఎండీఏ/1832/ఎంఇడ్/2023 హెచ్ఎండీఏ జారీచేసిందని తెలిపింది. ఈ విషయంలో రామక్రుష్ణారావుకు ఏలాంటి సంబంధం లేదని, నిజంగానే మున్సిపల్ కమిషనర్ల నుంచి ఏమైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని కోరింది. మున్సిపల్ కమిషనర్ల బాధ్యతలను ద్రుష్టిలో పెట్టుకుని కొంత వెసులుబాటు కల్పించాలని టీఎంసీఏ అధ్యక్షులు క్రుష్ణమోహన్ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed