Bandi Sanjay : మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం : బండి సంజయ్

by M.Rajitha |
Bandi Sanjay : మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ ; రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విరచుకుపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay). మూసీ సుందరీకరణ(Musi Beautification)కు భారతీయ జనతా పార్టీ(BJP) వ్యతిరేకం కాదని, కానీ మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల(Siricilla) జిల్లాలోని రుద్రంగిలో కేంద్రమంత్రి కూరగాయల మార్కెట్, సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రుద్రంగిలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ కేవలం రూ.15 వేల కోట్లతో పూర్తవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లకోసం రూ.లక్షన్నర కోట్లు అవుతాయని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రియల్ ఎస్టేట్ దందాకు తాము పూర్తిగా వ్యతిరేకం అన్నారు. మూసీ సుందరీకరణ చేస్తామంటూ పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, ఎక్కడివరకైనా వెళ్ళి కొట్లాడతామని ఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story