వారిని దాండియాకు అనుమతించొద్దు.. నిర్వాహకులకు భజరంగ్ దళ్ కన్వీనర్ హెచ్చరిక

by Y.Nagarani |
వారిని దాండియాకు అనుమతించొద్దు.. నిర్వాహకులకు భజరంగ్ దళ్ కన్వీనర్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: దుర్గమ్మవారి దసరా నవరాత్రులను పురస్కరించుకుని తెలంగాణలో దాండియా ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్లకు యువత ఎక్కువగా వెళ్తుంటారు. ఈవెంట్ కు ముందు చాలా ప్రాక్టీస్ చేసి.. స్పెషల్ డ్రెస్ కోడ్ తో దాండియా ఆడి.. నవరాత్రులను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఈ దాండియాకు అన్యమతస్తులను బౌన్సర్లుగా కానీ, సిబ్బందిగా కానీ తీసుకోవద్దని దాండియా నిర్వాహకులను తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు హెచ్చరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దాండియా ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన.. కొందరు దీనినే వేదికగా చేసుకుని లవ్ జిహాద్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దాండియా నిర్వాహకులు ఇతర మతస్తులను ఈవెంట్లకు బౌన్సర్లుగా, సిబ్బందిగా నియమిస్తే.. లవ్ జిహాద్ కు చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి, అన్యమతస్తులను అనుమతించవద్దని కోరారు. లేని పక్షంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు దాండియా ఈవెంట్లను అడ్డుకుంటారని హెచ్చరించారు.

Next Story

Most Viewed