- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘RR’ అంటే రేవంత్ రెడ్డినా..? సీఎం కాన్యాయ్ నెంబర్ ప్లేట్‌పై నెటిజన్స్ ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్స్ మరోసారి మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీ సిరీస్ ఉండగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్ సిరీస్‌ను అమలు చేశారు. దాదాపు పదేళ్ల పాటు TS పేరుతోనే వాహనాల రిజిస్టేషన్ జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో AP నుంచి TGగా మార్చాలని భావించినా కేసీఆర్ అధికారం చేపట్టాక.. దానిని TSగా మార్చారు. ఈ పేరుపై తెలంగాణ ప్రజలకు అసంతృప్తి ఉన్నా.. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక పోయారు.
తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు TS పేరును TGగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా మోటారు వెహికల్యాక్ట్-1988లోని సెక్షన్ 41 (6) ప్రకారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్చి 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో భాగంగా మార్చి 15 నుంచి తెలంగాణలో టీజీ సిరీస్‌లో వావానాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మొదటి రిజిస్ట్రేషన్ వెహికిల్స్‌గా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్లను మార్చారు. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి వెహికిల్స్‌కు టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను సెక్యూరిటీ సిబ్బంది తొలగించి వాటి స్థానంలో టీజీ పేరుతో ఉన్న వాటిని బిగించారు. అయితే ఈ నెంబర్ల ప్లేట్లలో ఉన్న ‘RR’పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మాజీ సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబర్ 6 వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే వారు. ఏ కార్యక్రమం చేపట్టినా 6 ఉండేలా చూసుకునే వారు.
తాజా సీఎం రేవంత్ రెడ్డి సైతం తన లక్కీ నంబర్ 9 వచ్చేలా చూస్తున్నారు. తన వెహికిల్ నెంబర్‌తోపాటు కాన్వాయ్ నెంబర్ కూడా 9 ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తగా టీజీ సిరీస్ ప్రారంభం అయ్యాక TG 09 RR వచ్చేలా అధికారులు నంబర్ ప్లేట్లను బిగించారు. ఈ నెంబర్ ప్లేట్ చూసిన నెటిజన్స్ RR అంటే Revanth Reddy నా అని ప్రశ్నిస్తున్నారు. వాట్ ఎన్ ఐడియా RR అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘రేవంత్ రెడ్డి’ కాన్వాయ్ అనేలా సీఎం వెహికిల్స్ ఉండటం యాదృచ్చికం కాదని పోస్ట్‌లు పెడుతున్నారు.