ఆటో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా?

by Ramesh N |   ( Updated:2024-04-03 11:55:53.0  )
ఆటో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించడం.. రాత్రి మత్తులో ఉండటం.. అతి వేగం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆసక్తికర వీడియో ట్వీట్ చేశారు. ఆటో ప్రమాదాలకు ఎందుకు జరుగుతున్నాయో వివరించారు.

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రోడ్డుపై సడెన్‌గా లైన్ మారడం, అకస్మాత్తుగా ఆటో ఆపడం, టర్నింగ్‌లో ఓవర్ స్పీడ్‌గా వెళ్లడం లాంటి కారణాల వల్ల ఆటో ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ చేయవద్దని, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని వెల్లడించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు సైబరాబాద్ వేసిన ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ పక్కన ఎంతమంది కూర్చున్న కూడా ట్రాఫిక్ పోలీసులు చూస్తూనే ఉన్నారు కానీ చలాన్లు వేయడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాల బారిన పడుతున్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed