కేసీఆర్.. ఇక ఫామ్ హౌస్‌లో పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందే: డిప్యూటీ CM డీకే శివకుమార్

by Satheesh |   ( Updated:2023-11-10 12:52:47.0  )
కేసీఆర్.. ఇక ఫామ్ హౌస్‌లో పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందే: డిప్యూటీ CM డీకే శివకుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని, మరి మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన ఇవాళ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ తన పేరుతో నకిలీ లెటర్ సృష్టించారని, కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఇదివరకే ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

Advertisement

Next Story