- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరా..? సీఎంపై D. K. Aruna ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: దుబాయ్ శేఖర్ అలియాస్ సీఎం కేసీఆర్ ఒక భూదొంగ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, అలాంటిది ఆయన్ను పరామర్శించడానికి వెళ్తుంటే తనను అడ్డుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం గుడ్డిదని, రైతుల కష్టాలు వారికి కనిపించడంలేదన్నారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. నిర్మల్ ఇందల్వాయి వద్ద తనను పోలీసులు అడ్డుకున్నారని ఫైరయ్యారు.
కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో భూదందా చేస్తోందని ఆరోపించారు. ఆయనో భూ దొంగ అని మండిపడ్డారు. తెలంగాణ భూములను కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ద్వారా దోచుకోవడం పూర్తవగానే ప్రభుత్వ భూములను కార్పొరేట్ వ్యక్తులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. రైతులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు కొంచెం కూడా బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని విరుచుకుపడ్డారు. మాస్టర్ ప్లాన్‌తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, రైతులను ఇబ్బందిపెడుతున్న జీవో 220ని రద్దుచేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రజలకు మంచి చేశాడని చెప్పుకుంటున్నాడని, అదే చేస్తే ఎన్నికలు సమీపిస్తుంటే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయడానికే మద్యం టెండర్లు ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్‌కు కొంచెమైనా సిగ్గుండాలని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు తెలంగాణ ప్రజలు నిద్రపోరని డీకే అరుణ చెప్పుకొచ్చారు. కేంద్ర పథకాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనివార్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
కేసీఆర్, కేటీఆర్ మోసాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. నిరాహార దీక్ష చేస్తున్న ఏలేటిని పరామర్శించేందుకు వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తుందని ఎందుకు అడ్డుకున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరా అని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ ఆని ఆమె విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆమె చెప్పారు. బీజేపీ అంటే కేసీఆర్‌కు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అండర్ స్టాండింగ్‌తో ధర్నాలు చేపడుతున్నాయన్నారు.