- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం.. డీకే అరుణ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై నిరసన తెలిపిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఇతర కార్యకర్తలను చంచల్ గూడ జైలులో వేసిన విషయం విధితమే. కాగా శుక్రవారం వారిని డీకే అరుణ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వానికి కనీసం చిత్త శుద్ధి లేదని మండిపడ్డారు.
నిరుద్యోగుల భవిష్యత్ ను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మేల్యేలు గాలికొదిలేసి కేవలం ఎమ్మెల్సీ కవిత కేసుపై శ్రద్ధ చూపుతున్నారని, ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. డబ్బు, అధికార మదంతో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాడుతున్న యువ మోర్చా నాయకులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆమె ధ్వజమెత్తారు. యువ మోర్చా నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.