Thummala : వ్యవసాయ యాంత్రీకరణపై జిల్లాల వారిగా ఎగ్జిబిషన్లు : మంత్రి తుమ్మల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-12 12:27:08.0  )
Thummala : వ్యవసాయ యాంత్రీకరణపై జిల్లాల వారిగా ఎగ్జిబిషన్లు : మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ(Agricultural mechanization)విస్తరణకు రైతాంగానికి ఆధునిక వ్యవసాయ అవగాహాన పెంపొందించేందుకు త్వరలో జిల్లాల వారిగా ఎగ్జిబిషన్ల(Exhibitions)ను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao)అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, వ్యవసాయ డైరెక్టర్ గోపి, సహకార సంస్థల ప్రతినిధులతో సమీక్షా చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు, పనిముట్లు తయారీదారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాంచారు.

దీంతో జిల్లాల యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని వ్యవసాయ డైరెక్టర్ గోపి తెలియజేశారు. అంతేగాక మంత్రి ఆదేశాలతో ఈ యాసంగి నుండి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్దం చేసామని, అందులో భాగంగా జిల్లాల వారీ ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్ధం చేసినట్లు గోపి తెలిపారు.

Advertisement

Next Story