యే కూర్చో వ‌య్యా.. ఏదో ఉండే నీ పేపర్? మాజీ సీఎంను ఇమిటేట్ చేసిన మంత్రి పొంగులేటి!

by Ramesh N |
యే కూర్చో వ‌య్యా.. ఏదో ఉండే నీ పేపర్? మాజీ సీఎంను ఇమిటేట్ చేసిన మంత్రి పొంగులేటి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో యావత్తు ప్రజలతో పాటు, మీడియా మిత్రుల సహకారంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం.. 18 ఏళ్ల చిరకాల కోరిక నేడు జర్నలిస్ట్ సోదరులకు తిరిందన్నారు. సీఎం సహకారంతో అనేక పర్యాయాలు జర్నలిస్టు ఇళ్ల స్థలాలపై చర్చించినట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలు పొందిన 1105 మంది సభ్యులు పెద్ద కోటీశ్వరులు అని హర్షం వ్యక్తంచేశారు. గతంలో సీఎంను కలవాలంటే జర్నలిస్టులు ఎదురుచూసేవారని అన్నారు.

యే కూర్చో వ‌య్యా కూర్చో..

గత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో తనకు అనుకూలమైన ప్రశ్నలు వస్తేనే సమాధానం చెప్పేవారని విమర్శించారు. నాటి ముఖ్యమంత్రిని ఇదేంటిది సార్ అని ప్రశ్నిస్తే.. యే కూర్చో వ‌య్యా కూర్చో.. ఏదో ఉండే నీ పేపర్.. ఏంటది? అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇమిటేట్ చేసి చూపించారు. గతంలో మీడియా పై ఉక్కుపాదం మోపారని ఆరోపించారు. కానీ నేటి ప్రభుత్వంలో స్వేచ్చగా కొంత మంది సీఎం, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు రాసిన.. అవి నిజాలు కాకపోయిన.. వారిని ఎక్కడ ఇబ్బందులు పెట్టలేదని చెప్పారు. స్వేచ్ఛ అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో రాయాలన్నారు. కొన్ని ఎల్లో పేపర్లు, పింక్ మిత్రులు ఉన్నారని, వాళ్ళు ఏ రకంగా చిత్రికరిస్తున్నారో చూస్తున్నామని వెల్లడించారు.

హైడ్రా అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఆ హైడ్రాని కూడా వాళ్లు ఏ విధంగా చిత్రికరిస్తున్నారో చూస్తున్నామని వెల్లడించారు. వరదలపై ఆ నాటి నాయకులు రాజకీయం చేస్తున్నారని, దాన్ని బొమ్మలు బొమ్మలుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. అయిన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క మీడియాపైన కేసు పెట్టింది లేదన్నారు. భవిష్యత్‌లో కూడా ఉండదన్నారు. కొందరు శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని, వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన ఇంకా వారికి జ్ఞానోదయం కాలేదన్నారు. జన్యూన్ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఈ భూ పంపిణీ ప్రారంభం మాత్రమేని ఇంకా అర్హులైన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని వారిపట్ల ఈ ప్రభుత్వం పాజిటీవ్‌గానే ఉందన్నారు. జర్నలిస్ట్ సభ్యులు జన్యూన్ లిస్ట్ ఫైనల్ చేస్తే.. ఇళ్ల స్థలాల పంపిణీ ఉంటుందని, వెనక్కి తగ్గేదే లేదని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed