- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Interruption in Metro Services: నగరవాసులకు బిగ్ షాక్.. ఆ రూట్లలో ఆగిన మెట్రో సర్వీసులు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే మెట్రో రైలు సర్వీసులు (Metro Rail Services) ఒక్కసారిగా నిలిచిపోయాయి. సోమవారం ఉదయం నాగోల్ (Nagole) నుంచి రాయదుర్గం (Raidurg) వెళ్లే రూట్లో అకస్మాత్తుగా సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగంపేట (Begumpet) మెట్రో స్టేషన్‌లో 13 నిమిషాల పాటు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మలక్‌పేట- ముసారంబాగ్ మార్గంలో కూడా సేవలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై మెట్రో సర్వీసు నిలిచిపోవడంతో అదే రూట్లో వెళ్లే సర్వీసులు సైతం కాసేపు పూర్తిగా నిలిచిపోయాయి. అప్రమత్తమైన మెట్రో రైలు సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించారు. అనంతరం సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఊహించని పరిణామంతో ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వారు కాస్త ఆలస్యంగా వారి వారి గమ్యస్థానాలకు చేరారు.