Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం.. సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్

by Shiva |
Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం.. సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు (High Court) కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. అదేవిధంగా అసెంబ్లీకి కార్యదర్శికి సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో సుమోటో కేసుగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ (High Court Division Bench) నిరాకరించింది. ఈ నెల 24న ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి వాదనలు వింటామని డివిజన్ బెంచ్ తెలిపింది.

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు (High Court)లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఎమ్మె్ల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

Next Story

Most Viewed