‘దిశ’ ఎఫెక్ట్.. చలాన్ రిమూవ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

by Sathputhe Rajesh |
‘దిశ’ ఎఫెక్ట్.. చలాన్ రిమూవ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇటీవల ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పట్టుబడింది ఒక బండైతే.. ఫైన్ మరో బండికా?’అనే శీర్షికకు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. TS 27 C 4258 నెంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ బండిపై విధించిన ఫైన్‌ను తొలిగించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడిన ఓ స్కూటి నెంబర్ కనపడకపోవడంతో తన హెచ్‌ఎఫ్ డీలక్స్ బండికి ఫైన్ వేశారని జనగామకు చెందిన సంపత్ పబ్బా అనే వాహనదారుడు ట్విట్టర్ వేదికగా డీజీపీకి ఫిర్యాదు చేయగా.. దిశ కథనం రాసింది. పోలీసులు స్పందించి ఫైన్ తొలగించారు. దీనిపై సంపత్ హర్షం వ్యక్తం చేస్తూ దిశ యాజమాన్యాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story