‘దిశ’ ఎఫెక్ట్.. రూ.150 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ సేఫ్..!

by Satheesh |
‘దిశ’ ఎఫెక్ట్.. రూ.150 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ సేఫ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో కమ్మ సంఘానికి భూ కేటాయింపు పేరుతో దానికి ఆనుకుని ఉన్న భూమిని కాజేసేందుకు ఓ గులాబీ లీడర్ చేసిన ప్రయత్నాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ‘దిశ’ ఈ నెల 20న ‘రూ. 150 కోట్ల సర్కారు భూమిపై గులాబీ నేత కన్ను’ పేరుతో వివరణాత్మకమైన కథనాన్ని ప్రచురించింది. కమ్మ సంఘానికి కేటాయించిన ఐదెకెరాల భూమికి ఆనుకుని అదే సర్వే నెంబర్‌లో ఉన్న 2.30 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కథ నడిచిందని, ప్రభుత్వం దృష్టికి ఈ వ్యవహారం చేరిందని పేర్కొన్నది.

దీనికి కొనసాగింపుగా రెవెన్యూ శాఖ ఆ భూమిలో ‘ఇది సర్కారుకు చెందిన భూమి.. అనధికార చొరబాటుపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరిస్తూ శనివారం ఓ బోర్డును ఏర్పాటుచేసింది. ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా నలుగురు ప్రభుత్వ సిబ్బంది ఫోన్ నెంబర్లను ప్రకటించింది. ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడుకోవడంపై రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని 2.3 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 150 కోట్ల విలువ ఉంటుందని అంచనా.

Advertisement

Next Story

Most Viewed