- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరాశజనకంగా యూనియన్ బడ్జెట్.. బీజేపీపై ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ సామాన్య ప్రజలకు నిరాశ కలిగించిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్రలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. స్వదేశీ మరియు విదేశీ సంస్థల కోసం కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గించబడ్డాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కు చట్టపరమైన హామీ ఇప్పటికీ సుదూర కలగానే మిగిలిందని తెలిపారు. రక్షణ రంగానికి రూ .4,54,773 కేటాయించగా, వ్యవసాయం ,విద్యా రంగానికి వరుసగా రూ 1,51,851, రూ 1,25,638 మాత్రమే కేటాయించారన్నారు.
ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే కొత్త ఉపాధి నైపుణ్య పథకం గురించిన వాగ్దానాలు ఇప్పటికే ఉన్న 'స్కిల్ ఇండియా' విఫలమైనట్లు చూపుతున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల సృష్టి మోదీ హామీ ఇప్పటికీ అబద్ధాల మాటలు జుమ్లాగానే మిగిలిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగాలు పబ్లిక్ సెక్టార్‌లలో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేయడం గురించి ప్రస్తావించలేదని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో పూర్తిగా నిర్లక్ష్యం చేసారని తెలిపారు. ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరిగినా బడ్జెట్‌లో రైల్వే భద్రత గురించి ప్రస్తావించలేదన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ యువత, విద్యార్థి వ్యతిరేకం, ప్రజావ్యతిరేకమైనది, కేవలం భాజపా కార్పొరేట్ మాస్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుందని ధ్వజమెత్తారు.