- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Deeksha Divas : బీఆర్ఎస్ నేతల దీక్షా దివస్ ర్యాలీ
దిశ, వెబ్ డెస్క్ : 2009 నవంబర్ 29న కేసీఆర్(KCR) ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా నేడు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో దీక్ష దివస్(Deeksha Divas) కార్యక్రమాలు జరిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు దీక్ష దివస్ పేరుతో సభలు, సమావేశాలు జరిపారు. అలాగే నేటి సాయంత్రం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్(KTR), కవిత(Kavitha), తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పలువరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష దివస్ ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు ఈ పాదయాత్ర ర్యాలీ సాగింది. ఎమ్మెల్సీ కవిత కేడర్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో కార్యకర్తల డ్యాన్స్ లు ఆకట్టుకున్నాయి. భవన్ లో ఉద్యమఘట్టాలను తెలిపే ఫొటోలను ఎగ్జిబిషన్ కి ఉంచారు. కాగా శుక్రవారం దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్‌లోని అల్గునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని, కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ఆ పార్టీ మీద పోరాటం చేయాలని, ప్రతి వేదికలో తెలంగాణ పక్షాన పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
- Tags
- deeksha divas