Diabetic Patients: షుగర్ పేషెంట్లకు బంపర్ న్యూస్.. ఆ మందుల ధరలను భారీగా తగ్గించిన కేంద్రం

by Shiva |
Diabetic Patients: షుగర్ పేషెంట్లకు బంపర్ న్యూస్.. ఆ మందుల ధరలను భారీగా తగ్గించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న మధుమేహ, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆ వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వాడే 41 రకాల, 6 ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఉత్తర్వుల మేరకు గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు, మల్టీవిటమిన్‌లు, యాంటీబయాటిక్‌ల మందుల భారీగా తగ్గనున్నాయి. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్‌పీపీఏ అధికారులు వెల్లడించారు. ధరలు తగ్గే వాటిల్లో 30 డపాగ్లిఫ్లోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఈ ట్యాబ్లెట్లు బ్లడ్‌లోని గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. వాటి ధర రూ.16గా నిర్ణయించారు. అదేవిధంగా ఆస్తమా, లంగ్స్ సమస్యలకు వాడే బుడెసోనైడ్, ఫార్మోటెరాల్ ఒక డోస్ ధర రూ.6.62కి తగ్గించారు. ఇక మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ సమస్య, యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు సహా అనేక ఔషధాల ధరను ఎన్‌పీపీఏ తగ్గించింది.

Advertisement

Next Story