Dharmapuri Arvind : ఖాకీలు కూడా దేకట్లే! కేటీఆర్ అరెస్ట్‌పై ధర్మపురి అర్వింద్ సెటైర్లు!

by Ramesh N |
Dharmapuri Arvind : ఖాకీలు కూడా దేకట్లే! కేటీఆర్ అరెస్ట్‌పై ధర్మపురి అర్వింద్ సెటైర్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో నిరసనలు చేశారు. స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు.

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. అనంతరం అసెంబ్లీ ముందు రోడ్డుపై నిరసనలు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, అసెంబ్లీలో కేటీఆర్‌ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేటీఆర్ అరెస్ట్ వీడియో పోస్ట్ చేశారు. ‘అప్పుడు.. కన్ను మిన్ను కనపడలే ! ఇప్పుడు.. ఖాకీలు కూడా దేకట్లే’ అని అర్వింద్ సెటైర్లు వేశారు.

Advertisement

Next Story