- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ప్రతిష్టాత్మక ధరణి ప్లేస్‌లో కొత్త పోర్టల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను తయారుచేసే పనిని ప్రారంభించింది. లీగల్‌గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్ వేర్‌లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని ఆరో అంతస్తులోనే స్పెషల్ సెల్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
దీనిని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతర పర్యవేక్షించనున్నారు. పోర్టల్‌ను తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని దానికి తగినట్టుగా సాఫ్ట్ వేర్‌లో టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ, మాడ్యూళ్లలోనూ తగిన మార్పులు చేయాల్సిన అవసరంపై రివ్యూ చేయనున్నారు.
తాసీల్దార్లకూ అధికారాలు..!
ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. ఫలితంగా చిన్న సమస్య సైతం జిల్లా స్థాయిలో పెండింగ్ పడిపోతున్నది. తాసీల్దారుకు సైతం కొన్ని అధికారాలను ఇవ్వాలని, దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీని కల్పించేలా ప్లానింగ్ జరుగుతున్నది. సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఏయే అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించే వెసులుబాటు ఉన్నదనే విషయాన్నీ స్టడీ చేసి ఆ తరహాలో సాఫ్ట్ వేర్‌ను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాలు రెవెన్యూ అధికారులు, నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి.
పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిల్లోని రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డీసెంట్రలైజేషన్ ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని సర్కారు సైతం భావిస్తున్నది. ఒక వేళ దుర్వినియోగానికి పాల్పడితే వారిని, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను జవాబుదారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. మరోసారి అది రిపీట్ కాకుండా మార్పులపై పునరాలోచన చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నది.
భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యంగా..
గ్రామాల్లో రైతులకు భూములు జీవనాధారమే కాక సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిస్టమ్ తేవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అంతిమంగా ధరణి ద్వారా ఇప్పటివరకూ తలెత్తిన సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు వాటికి పరిష్కారాన్ని కనుగొనే వేదికగా భూమాత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. ధరణిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం ఆ రంగ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో కసరత్తును ప్రభుత్వం మొదలుపెట్టింది. పోర్టల్‌ను పకడ్బందీగా రూపొందించడానికి సెక్రటేరియట్‌లో స్పెషల్ చాంబర్‌ను సైతం సీఎం కేటాయించారు. సాఫ్ట్ వేర్ రూపకల్పనలో ఐటీ ఇంజినీర్లతోనూ, రెవెన్యూ అధికారులతోనూ సందర్భానుసారం మాట్లాడుతూ వారి అభిప్రాయాలతో పాటు అంతిమంగా ఈ పోర్టల్ ఎలా ఉండాలో తగిన సూచనలు చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించేలా సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండేలా భూమాతను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలన్నది సీఎం లక్ష్యం.