చివరి నిమిషయంలో ధరణి మీటింగ్ వాయిదా.. కారణమిదే!

by GSrikanth |
చివరి నిమిషయంలో ధరణి మీటింగ్ వాయిదా.. కారణమిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారం కోసం గురువారం నిర్వహించతలపెట్టిన ధరణి కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ భేటీ శనివారం జరగనున్నది. ధరణి సమస్యలపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌పై సమీక్షించనున్నారు. ధరణి పోర్టల్‌లోని వివిధ మాడ్యూళ్ల ద్వారా వచ్చిన అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. అలా పెండింగ్‌లోని 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టనున్నారు. జూన్ 4వ తేదీలోగా ఎట్టి పరిస్థితిలోనైనా అన్ని ధరణి కంప్లైంట్స్ క్లోజ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ధరణి కమిటీలోని ఒక సభ్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే శనివారానికి వాయిదా వేశారని తెలిసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో భేటీ కొనసాగనున్నది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎమ్మాఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డితో పాటు ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్, రేమండ్ పీటర్, ఎం.కోదండరెడ్డి, మధుసూదన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Advertisement

Next Story