ఎన్నికల సన్నద్దతపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్​

by Nagaya |   ( Updated:2023-09-29 15:09:54.0  )
ఎన్నికల సన్నద్దతపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్​
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్​ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్సీలు, కమిషనరేట్ల కమిషనర్లతో మాట్లాడిన డీజీపీ అంజనీకుమార్​ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీజీలు మహేశ్​భగవత్, స్వాతి లక్రా, సంజయ్​కుమార్​జైన్​తోపాటు ఐజీ రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలను పురస్కరించుకుని చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్లు, ఎస్పీలు డీజీపీకి వివరించారు.

పోలీసుల కృషి ప్రశంసనీయం

వినాయక నిమజ్జన మహా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేలా చూడటంలో పోలీసులు చేసిన కృషి ప్రశంసనీయమని డీజీపీ అంజనీకుమార్​కొనియాడారు. లక్షలాది సంఖ్యలో జనం పాల్గొన్న నిమజ్జన యాత్ర శాంతియుతంగా ముగియటంలో సహకరించిన వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. పోలీస్​కమాండ్​కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన వార్​రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి సూచనలు ఇవ్వటం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడగలిగారన్నారు.

Advertisement

Next Story