- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టి క్రీడల్లో సత్తా చాటాలి: డీజీపీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: యువ పోలీసులు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి, క్రీడల్లో సత్తా చాటాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు. తద్వారా పోలీసుశాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పేర్కొన్నారు. రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ ఖాసిం 1961–67 మధ్యలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లలో గెలుపొందిన 16 బంగారు, వెండి పతకాలను గురువారం పోలీస్ మ్యూజియానికి బహుకరించారు.
ఈ సందర్భంగా హిమాయత్ సాగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్మాట్లాడారు. మహమ్మద్ ఖాసిం ఒకవైపు తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, క్రీడల్లో రాణించి మెడల్స్ సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న యువ సిబ్బందికి ఆదర్శనీయమని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీపీలు అభిలాష బిస్త్, షికా గోయల్, ఎస్కే జైన్ పాల్గొన్నారు.