- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు అసెంబ్లీలో చర్చ జరిగే అంశాలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇగిరేషన్ శాఖలో జరిగిన అవినీతిపైనే గత మూడ్రోజులుగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఇవాళ అసెంబ్లీలో మరో కీలక చర్చ జరుగనుంది. నేటి అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం ప్రవేశపెట్టనుంది. కాగా, నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కొంతకాలంగా చెబుతూ వస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో కొనసాగిన పదేళ్లలో రైతుల సాగుకు నీళ్లు ఇవ్వడానికి కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసేలా పనులు అప్పగించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై శ్వేతపత్రంలో పూర్తి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవానికి నిన్ననే ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టాల్సి ఉంది. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరుగడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. శుక్రవారం ఈ తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.
నేడు అసెంబ్లీలో చర్చ జరిగే అంశాలు ఇవే
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2024
ఈరోజు అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. pic.twitter.com/NPMm9gF5aX