ఉద్యోగుల మధ్య ఆ తేడా వద్దు: డిప్యూటీ సీఎం భట్టి

by karthikeya |   ( Updated:2024-10-07 07:47:30.0  )
ఉద్యోగుల మధ్య ఆ తేడా వద్దు: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌‌డెస్క్: సింగరేణి సంస్థలో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ మధ్య ఖర్చు విషయంలో వ్యత్యాసం చాలా ఉందని, ఈ వ్యాత్యాసాన్ని తగ్గించుకోవానికి సంస్థ ప్రయత్నించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ఓ టన్ను బొగ్గు ఉత్పత్తి చేయడానికి రెగ్యులర్ ఎంప్లాయీపై రూ.3 వేల నుంచి 9 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంటే.. అదే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీకి రూ.1500 నుంచి రూ.4,500 వరకు మాత్రమే ఖర్చవుతోందని, ఈ వ్యాత్సారం సరికాదని అన్నారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సింగరేణి కార్మికులు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్మికుల వేతనాల్లో భారీ వ్యాత్యాసం ఉండడం శ్రమ దోపిడీ అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమదోపిడీని సహించదని, అందువల్ల ఈ వ్యత్యాసాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యత్యాసాన్ని తగ్గిండచం ద్వారా వచ్చిన లాభాలను సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం వినియోగిస్తామని భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మినిమం వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే కమిటీ వేసి కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మధ్య ఉండే వేతనాల వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం సింగరేణి పరిసర ప్రాంతాల్లాల్లో మెడికల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతూ.. గనుల్లో పని చేసే కార్మికులతో పాటు ఈ ప్రాంతలోని ప్రజల్లో ఎవ్వరూ వైద్యం కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా అక్కడే మెరుగైన వైద్యం అందేలా అధునాత హాస్పిటల్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం సింగరేణి ప్రాంతంలో విద్యా సౌకర్యాలపై కూడా ఆయన స్పందించారు. సింగరేణి ల్యాండ్ ఇస్తే ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించిన యంగ్ ఇండియా ఇంగిగ్రేటెడ్ స్కూల్స్‌ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రాంతంలోనే స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ విషయంలో కూడా అధ్యయనం చేసి ప్రస్తుతం రూ.8 లక్షలుగా ఉన్న దాన్ని రూ.10 లక్షల వరకు పెంచేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేశారు.

Advertisement

Next Story