షాద్‌నగర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్.. భట్టికి కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
షాద్‌నగర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్.. భట్టికి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి శిక్షించిన.. అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు. సీఎం చెప్పిన వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత పోలీసు సిబ్బంది, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నత అధికారులను ఆదేశించారు.

డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిని వెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి సంఘటనలను సహించేది లేదని డిప్యూటీ సీఎం పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి వైద్య సహాయంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా నిలుస్తామని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారుల ద్వారా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నత అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed