- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti: గ్రూపు-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈనెల 14న శంకుస్థాపన చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ(Congress party) ఏడాది పాలనపై ఈనెల 14 నుంచి విజయోత్సవాలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. 28 పారా మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాదు.. ఈ ఉత్సవాల్లోనే గ్రూపు-4(Group-4) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించారు. పెట్టుబడులపై పలు కంపెనీలతో ఒప్పందాలు సైతం చేసుకోబోతున్నట్లు అన్నారు. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్‌లో భారీగా ప్రజా విజయోత్సవాలు ఉంటాయని తెలిపారు.