- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్‌లో ఈ సారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే: భట్టి
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సికింద్రాబాద్ పార్లమెట్ పరిధి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ మనదే అని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సీటు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే భిన్నంగా ఈ సారి లోక్‌సభ ఎన్నికలు ఉండబోతున్నాయని అన్నారు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అని.. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంలో ఇతర అంశాలేవీ లేవని.. వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని స్పష్టం చేశారు.
ప్రజలు తరిమికొట్టినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఎవరొచ్చినా ఇక బీఆర్ఎస్ గట్టెక్కించడం కష్టం అని అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రజలకు మంచి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. ఆ విషయాన్ని గుర్తించే తమకు అధికారం కట్టబెట్టారని వెల్లడించారు. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి బీఆర్ఎస్ శ్రేణులు గుర్తించుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల ఉడుత ఊపులకు కాంగ్రెస్ భయపడే పార్టీ కాదని అన్నారు.