- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి పొన్నంకు కీలక బాధ్యతలు అప్పగించిన భట్టి.. వేదిక మీద నుంచే ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. భవిష్యత్ తరాలకు పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలని అభిప్రాయపడ్డారు. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక కేంద్రం నిర్మాణానికి రూ.4.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్‌దే అని సూచించారు. అంతేకాదు.. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి ప్రజలకు తెలిసేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ రాజ్యానికి కూడా సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకం అని అన్నారు.