Deputy CM Bhatti: రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-13 10:27:10.0  )
Deputy CM Bhatti: రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మంగళవారం పాఠశాలకు వచ్చిన భట్టి.. పరిసరాల్లో కలిగిదిరుగుతూ పరిశీలించారు. గురుకులంలో చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల మృతి బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం పాఠశాలల పట్ల చూపిన నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అన్నారు. పెద్దాపూర్ గురుకులంలో మిగిలిపోయిన పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలనే కాదని.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో డిప్యూటీ సీఎం భట్టి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed