- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Council: ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం
దిశ, వెబ్‌డెస్క్: తాము ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులను కలిసి సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా ఇవ్వాలని కోరుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లలో సాధించిన దాని కంటే తమ ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందని డిప్యూటీ సీఎం వివరించారు. పదేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, గత ఏడాది కాలంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలతో తాను సభకు వచ్చానని తెలిపారు.
కేంద్రం రాష్ట్రానికి నేరుగా నిధులు కేటాయించదు, ఆ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రత్యేక పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుందని వివరించారు. తమ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటుంది, మేము ఏ వివరాలను దాచుకునే వాళ్ళం కాదని అన్నారు. కేంద్రం జీఎస్టీ బిల్లును తీసుకురాగా గత ప్రభుత్వం మద్దతునిచ్చిందని.. ఆ తర్వాత వారు బిజెపితో వైరం పెట్టుకున్నారని అన్నారు.