ఢిల్లీ లిక్కర్ స్కాంలో బుచ్చిబాబుకు బెయిల్

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బుచ్చిబాబుకు బెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. సోమవారం బుచ్చిబాబుకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుతో పాటు పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. బుచ్చిబాబును ఫిబ్రవరి 8వ తేదీన అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. కోర్టు మొదట మూడు రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

అనంతరం దాన్ని మరో 14 రోజులు పొడిగించింది. ఆ గడువు ముగియడంతో ఫిబ్రవరి 25వ తేదీ మరోసారి న్యాయస్థానంలో హాజరుపర్చగా ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా..తీర్పును ప్రత్యేక జడ్జి మరుసటి రోజకు వాయిదా వేశారు. గురువారం ప్రత్యేక జడ్జి సెలవులో ఉండడంతో తీర్పు వాయిదా పడింది. దీంతో నేడు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం బుచ్చిబాబు తీహార్ జైలులో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed