- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ: MLC కవితతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శుక్రవారం హుటాహుటినా ఢిల్లీకి బయలుదేరారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇద్దరు మంత్రులు హస్తినాకు వెళ్లారు. తొలుత వెళ్లిన కేటీఆర్ ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఎమ్మెల్సీ కవితతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు తెలిసింది. శనివారం కవితను లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రుల హస్తినా టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే ఎలాంటి తప్పు చేయలేదని విచారణకు సహరిస్తామని కవిత స్పష్టం చేసింది. ఇప్పుడు కవితకు బాసటగా నిలిచేందుకు హస్తినకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. నైతిక మద్దతు ఇవ్వడానికే వెళ్లినట్లు సమాచారం. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. శనివారం లీగల్ సెల్ సభ్యులతో కూడా భేటీ కానున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో ఎలా ముందుకెళ్దాం..? అనేదానిపై బీఆర్ఎస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికే ఢిల్లీ వెళ్లారని విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ కవిత అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంజరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.