ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యం.. అసెంబ్లీకి హాజరు డౌటే!

by GSrikanth |   ( Updated:2023-12-08 07:27:03.0  )
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యం.. అసెంబ్లీకి హాజరు డౌటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మూడవ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం అసెంబ్లీ ముస్తాబవుతున్నది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల చేత ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం శనివారం ప్రత్యేక సెషన్‌లో జరగనున్నదని మంత్రి శ్రీధర్ బాబు గురువారం రాత్రే తెలియజేశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్‌రూమ్‌లో జారి పడి తుంటి ఎముక విరగడంలో యశోద ఆస్పత్రిలో చేరారు. హిప్ రీప్లేస్‌మెంట్ జరగాల్సి ఉన్నదని వైద్యులు సూచించడంతో షెడ్యూలు ప్రకారం శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేని పరిస్థితి ఉత్పన్నమైంది. ఎనిమిది వారాల వరకూ ట్రీట్‌మెంట్‌లోనే ఉండాలని వైద్యులు సూచించడంతో ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం అంశంల క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story