- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పూర్తయినా పంపిణీలో జాప్యం.. కమలాపూర్‌లో డబుల్ ఇండ్ల ముట్టడికి యత్నం..
X
దిశ,కమలాపూర్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేయడం లేదని సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఇళ్లు లేక కూలీ పని చేసుకునే నిరుపేదలు కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి అయినా ప్రభుత్వం ఇండ్ల పంపిణీలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్ల పంపిణీ చేయాలని సీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Next Story