- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
DSC-2024: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువత్రాల పున: పరిశీలన
దిశ, వెబ్ డెస్క్: డీఎస్సీలో నకిలీ ధ్రువపత్రాలు(Fake Certificates In DSC) సమర్పించారని వచ్చిన ఫిర్యాదులపై విద్యాశాఖ(Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా(Sports Quota) అభ్యర్థుల ధ్రువపత్రాలన పున:పరిశీలించాలని(Re-Examine) నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన డీఎస్సీ పరీక్ష(DSC Examination)లో ఎంపికైన అభ్యర్ధులకు ఇటీవలే నియామక పత్రాలు(Appointment Papers) అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని డీఎస్సీ బోర్డ్(DSC Board) కు పలు ఫిర్యాధులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్పోర్ట్స్ కోటా అభ్యర్ధుల ధ్రువపత్రాలను తిరిగి మరోసారి పరిశీలించాలని నిర్ణయించారు. దీంతో స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 20, 21, 22 తేదీల్లో అధికారులు పున: పరిశీలించనున్నారు. డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటాలో 393 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. డీఎస్సీ బోర్డ్ వారి ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించనుంది. కాగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్ లైన్ ద్వారా సమర్పించారు.