Credit Card New Rules: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ ..!

by Maddikunta Saikiran |
Credit Card New Rules: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ ..!
X

దిశ, వెబ్‌డెస్క్: మనదేశంలో గత కొంత కాలంగా క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ పాయింట్స్, డిస్కౌంట్స్ లాంటివి ప్రకటిస్తుండంతో చాలా మంది వీటితో కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి కూడా కస్టమర్లు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. పలు రకాల లావాదేవీలపై ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ లాంజ్(Airport lounge) యాక్సెస్ లిమిట్ రూ. 35,000 నుంచి రూ. 75,000కు పెంచింది. ఇక రూ.101 నుంచి రూ.500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.100, రూ.50వేల కంటే ఎక్కువ పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.1300 వరకు వసూల్ చేస్తారు. అదేవిధంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా CRED, Paytm, Cheq, MobiKwik వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా విద్యాపరమైన చెల్లింపు చేస్తే లావాదేవీ మొత్తంపై 1 శాతం ఛార్జీని విధించనున్నారు. కాగా స్కూల్ లేదా కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు రూ.50,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై,1000 రూపాయల కంటే ఎక్కువ ఇంధన చెల్లింపు లావాదేవీలపై ఒక శాతం ఛార్జీ చెల్లించాలి. అలాగే పొడిగించిన క్రెడిట్, నగదు క్యాష్ అడ్వాన్స్‌లపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీలను వసూల్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed